నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘జై సింహా’ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించారు.
బాలకృష్ణ సరసన నయనతార, హరిప్రియ, నటాషా దొషీ కథానాయికలుగా నటించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్ 21కి వందరోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 22న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట న్యూ మార్కెట్ యార్డ్లో సాయంత్రం 5.00 గంటలకు ‘జై సింహా’ 100 రోజుల వేడుకను నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని నిర్మాత సి.కళ్యాణ్ మంగళవారం మీడియాకు వెళ్లడించారు.