“సైరా నరసింహారెడ్డి” టీజర్..!

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం “సైరా నరసింహారెడ్డి”. ఈ చిత్రంతో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, సుదీప్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు ఉండగా … ఒకరోజు ముందే “సైరా” టీజర్ తో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వాలని భావించిన చిత్రబృందం ఆగష్టు 21న ఉదయం 11.30 నిమిషాలకు “సైరా” టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి లుక్ ను చూపించారు. ఇక బ్రిటిషు కాలంలోని పోరాటయోధుడుగా, నరసింహారెడ్డిగా చిరంజీవి లుక్, డైలాగులు, నేపథ్య సంగీతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఈ టీజర్ కనువిందు చేస్తుంది. ఈ టీజర్ తో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

©2019 APWebNews.com. All Rights Reserved.