పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌..!

కంట పడ్డావా కనికరిస్తానేమో.. వెంటపడ్డానా నరికేస్తావోబా..' అని అంటూ ఎన్టీఆర్‌ శత్రువులను హెచ్చరిస్తున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'అరవింద సమేత'. 'వీరరాఘవ' అనేది ట్యాగ్‌లైన్‌.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పూజా హెగ్డే, ఈషా రెబ్బా కథానాయికలు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. జగపతిబాబు వాయిస్‌తో టీజర్‌ ప్రారంభమైంది. 'మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుండాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుపాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా?' అని జగపతిబాబు ఆవేశంగా బ్యాక్‌గ్రౌండ్‌లో శక్తివంతమైన డైలాగులు చెబుతుండగా, ఎన్టీఆర్‌ కత్తిపటుకుని పరిగెడుతున్న తీరు, విలన్లను మట్టికరిపిస్తున్న తీరు, డైలాగ్స్‌ చెప్పిన వైనం ఆద్యంతం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఇది పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా అని టీజర్‌ చెప్పకనే చెప్పింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.