తాజా వార్తలు

శ్రీకాంత్‌ ‘రా..రా’ ట్రైలర్‌ విడుదల

శ్రీకాంత్‌ ‘రా..రా’ ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌: ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రా..రా’. నజియా కథానాయిక. శంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కమెడియన్లు అలీ, పోసాని కృష్ణ మురళి, వేణు, గెటప్‌ శీను, చమ్మక్‌ చంద్ర, షకలక శంకర్‌, పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఇందులో శ్రీకాంత్‌ దర్శకుడి పాత్రలో నటిస్తున్నారు.

ట్రైలర్‌లో..శ్రీకాంత్‌ దెయ్యం సినిమా తీయాలనుకుంటాడు. కానీ సినిమా షూటింగ్‌ ప్రదేశాల్లో నిజంగానే దెయ్యలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో కమెడియన్లు పండించిన కామెడీ నవ్వులు పూయిస్తోంది. ర్యాప్‌ రాక్‌ షకీల్‌ సంగీతం అందిస్తున్నారు. ఎం.విజయ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

©2018 ApWebNews.com. All Rights Reserved.