బ్రిటీష్ కాలం నాటి కథ?

బాహుబలి అపూర్వ విజయం తరువాత దర్శకుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించనున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో వున్న రాజమౌళి ఈ చిత్రాన్ని 1980 కాలం నాటి కథ నేపథ్యంలో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం 1947 నాటి బ్రిటీష్ కాలం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో రాజమౌళి సర్వం సిద్ధం చేస్తున్నారని, స్వాతంత్య్ర సమరకాలంలో జరిగిన కొన్ని ఘట్టాల్ని కూడా ఈ చిత్రంలో చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. రాజమౌళి మార్కు భారీ సెట్‌లు, అబ్బురపరిచే గ్రాఫిక్స్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశం వుందని చిత్ర వర్గాల సమాచారం.

©2018 APWebNews.com. All Rights Reserved.