మ‌హేష్ రికార్డు బ్రేక్ చేసిన రామ్ చ‌ర‌ణ్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం పోకిరి. ఈ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల సునామి సృష్టించిన ఈ చిత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుద‌ర్శ‌న్ 35 ఎంఎం థియేట‌ర్‌లో రూ. 1,61,43,091 వసూళ్ళ‌ని రాబ‌ట్టింది. ఈ థియేట‌ర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే ఆల్‌టైం రికార్డ్ కాగా, దీనిని కేవ‌లం 89 రోజుల‌లో బ్రేక్ చేసింది రంగ‌స్థ‌లం చిత్రం. రూ.1,61,51,363 వ‌సూళ్లతో సుద‌ర్శ‌న్ 35ఎంఎం థియేట‌ర్‌లో ఎక్కువ క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా టాప్‌లో నిలిచింది రంగ‌స్థ‌లం. ‘పోకిరి’ సినిమా తరవాత రూ.1,58,41,594తో తరుణ్ ‘నువ్వేకావాలి’ మూడో స్థానంలో ఉండటం గమనార్హం. రూ.1.56 కోట్లతో ‘ఖుషి’ నాలుగో స్థానంలోనూ, రూ.1,52,20,489తో ‘బాహుబలి 2’ ఐదో స్థానంలో ఉన్నాయి. మొత్తానికి ఇప్ప‌టికే ప‌లు రికార్డులని చెరిపేసిన రంగ‌స్థ‌లం చిత్రం తన జాబితాలో ఈ రికార్డు కూడా చేర్చుకోవ‌డం విశేషం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ , స‌మంత హీరో హీరోయిన్స్‌గా న‌టించ‌గా జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, ప్ర‌కాశ్ రాజ్, అన‌సూయ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించారు.

©2019 APWebNews.com. All Rights Reserved.