తాజా వార్తలు

పవన్‌ టైటిల్‌ అనగానే ఆసక్తి నెలకొంది: చిరు

పవన్‌ టైటిల్‌ అనగానే ఆసక్తి నెలకొంది: చిరు

హైదరాబాద్‌: వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా జంట‌గా నటించిన చిత్రం ‘తొలిప్రేమ’. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. గతవారం విడుదలైన ఈ చిత్రం ఫీల్‌గుడ్‌ లవ్‌ మూవీగా మంచి టాక్‌ను అందుకుంది. ఈ సినిమాను చూసిన అగ్ర కథానాయకుడు చిరంజీవి చిత్రబృందాన్ని ప్రశంసించారు.

‘‘తొలిప్రేమ’తో మంచి విజయం అందుకున్న చిత్ర బృందానికి అభినంద‌న‌లు. ఇదొక కాంటెంపరరీ లవ్‌ స్టోరీ. సినిమా ఆల‌స్యంగా చూశాను. చూసి చాలా స్ఫూర్తి పొందాను. నా తమ్ముడు  ప‌వ‌న్ కల్యాణ్‌ నటించిన ‘తొలిప్రేమ’ టైటిల్‌తో  వ‌చ్చిన సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది.  దర్శకుడు వెంకీ అట్లూరి ఓ కొత్త కోణంలో సినిమా తెరకెక్కించారు. ఇలాంటి సినిమా చేయ‌డం దర్శకుడికి ఛాలెంజ్‌తో కూడుకున్న పని. ఇలాంటి  దర్శకులు ఇండస్ర్టీకి రావాలి.’’

 

©2018 ApWebNews.com. All Rights Reserved.