‘మెహబూబా’తో చార్మి రూ.కోట్లు పోగొట్టుకుందా?

తనయుడి కోసం అయిన సరైన కథతో రాలేకపోయాడు పూరీ జగన్నాథ్.. అనే విమర్శ వస్తోంది ‘మెహబూబా’ సినిమా విషయంలో. తనయుడిని హీరోగా సెటిల్ చేసేందుకు, దర్శకుడిగా తను తిరిగి సెటిల్ అయ్యేందుకు ‘మెహబూబా’ సినిమాను కసితో రూపొందిస్తాడని అంతా అనుకున్నారు.

అయితే తీరా ఆ సినిమా విడుదలై విమర్శల పాలైంది. ఆకట్టుకోదనే రివ్యూలను, నెగిటివ్ రేటింగులను పొందింది ఈ సినిమా. ఫలితంగా కమర్షియల్‌గా కూడా ఈ సినిమాపై పెద్ద దెబ్బే పడుతోంది. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద వేర్వేరు సినిమాలు ఉండటం, మరోవైపున నెగిటివ్ టాక్ పూరీ జగన్నాథ్ సినిమాను దెబ్బతీసింది. ఈ పరిణామాల మధ్యన ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి ఈ సినిమాతో నిర్మాతగా పూరీకే కాదు నటి చార్మికి కూడా బాగా నష్టం వాటిల్లిందని వార్తలు వస్తున్నాయి. పూరీ క్రియేటివ్ వర్క్స్ టీమ్‌లో ఒకరిగా ఉంది . ‘మెహబూబా’ సినిమా బాధ్యతల్లో కూడా పాలుపంచుకుందీమె. ఇప్పుడు ఈ సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్‌ అనిపించుకొంటూ ఉండటంతో.. చార్మికి కూడా నష్టాలు తప్పడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో చార్మి ఐదారు కోట్ల రూపాయలు నష్టపోయిందని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోందిప్పుడు. హీరోయిన్‌గా సంపాదించుకున్న డబ్బును చార్మి ఈ సినిమాతో లాస్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి అధికారిక ధ్రువీకరణ లేదు. సినీ జనాల మధ్యన ఈ చర్చ జరుగుతోంది. 

©2019 APWebNews.com. All Rights Reserved.