తాజా వార్తలు

శ్రీకాంత్‌ ‘రా..రా’ ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌: ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రా..రా’. నజియా కథానాయిక. శంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కమెడియన్లు అలీ, పోసాని కృష్ణ మురళి, వేణు, గెటప్‌ శీను, చమ్మక్‌ చంద్ర, షకలక శంకర్‌, పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఇందులో శ్రీకాంత్‌ దర్శకుడి పాత్రలో నటిస్తున్నారు.

ట్రైలర్‌లో..శ్రీకాంత్‌ దెయ్యం సినిమా తీయాలనుకుంటాడు. కానీ సినిమా షూటింగ్‌ ప్రదేశాల్లో నిజంగానే దెయ్యలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో కమెడియన్లు పండించిన కామెడీ నవ్వులు పూయిస్తోంది. ర్యాప్‌ రాక్‌ షకీల్‌ సంగీతం అందిస్తున్నారు. ఎం.విజయ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పవన్‌ టైటిల్‌ అనగానే ఆసక్తి నెలకొంది: చిరు

హైదరాబాద్‌: వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా జంట‌గా నటించిన చిత్రం ‘తొలిప్రేమ’. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. గతవారం విడుదలైన ఈ చిత్రం ఫీల్‌గుడ్‌ లవ్‌ మూవీగా మంచి టాక్‌ను అందుకుంది. ఈ సినిమాను చూసిన అగ్ర కథానాయకుడు చిరంజీవి చిత్రబృందాన్ని ప్రశంసించారు.

‘‘తొలిప్రేమ’తో మంచి విజయం అందుకున్న చిత్ర బృందానికి అభినంద‌న‌లు. ఇదొక కాంటెంపరరీ లవ్‌ స్టోరీ. సినిమా ఆల‌స్యంగా చూశాను. చూసి చాలా స్ఫూర్తి పొందాను. నా తమ్ముడు  ప‌వ‌న్ కల్యాణ్‌ నటించిన ‘తొలిప్రేమ’ టైటిల్‌తో  వ‌చ్చిన సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది.  దర్శకుడు వెంకీ అట్లూరి ఓ కొత్త కోణంలో సినిమా తెరకెక్కించారు. ఇలాంటి సినిమా చేయ‌డం దర్శకుడికి ఛాలెంజ్‌తో కూడుకున్న పని. ఇలాంటి  దర్శకులు ఇండస్ర్టీకి రావాలి.’’

 

భానుమతిగా..‘భాగమతి’?

హైదరాబాద్‌: అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తి సురేశ్‌ సావిత్రి పాత్రలో నటిస్తు్న్నారు. సమంత జర్నలిస్ట్‌ పాత్ర పోషిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు, ప్రకాశ్‌ రాజ్, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ, విక్రమ్‌ ప్రభు, షాలిని పాండే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు.

అయితే..ఇందులో అలనాటి నటి భానుమతి పాత్రలో ‘భాగమతి’ అనుష్క శెట్టి నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక సినిమాలు చేసిన నటీమణుల్లో సావిత్రి, భానుమతిలు కూడా ఉన్నారు. ఆమె పాత్రలో అనుష్కనే సరిపోతారని చిత్రబృందం భావించిందట. అయితే ఈ పాత్రకు అనుష్క ఒప్పుకుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. 

వైజయంతి మూవీస్‌ పతాకంపై తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అశ్విని దత్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 20న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చెన్నై: తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న కథానాయకుడు ధనుష్‌. కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా, గాయకుడిగా కూడా ఆయన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన హాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమయ్యారు. ధనుష్‌ నటిస్తున్న తొలి హాలీవుడ్‌ సినిమా ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ఫకీర్‌’. ఇందులో ఆయన ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి అక్కడి ప్రజల్ని కలుస్తుంటారు. ఆయన ప్రయాణాలు, అక్కడ ఎదుర్కొన్న సంఘటనలే ఈ సినిమా కథ.

నటీనటులు: రాహుల్‌ రవిచంద్రన్‌.. చాందినీ చౌదరి.. మనాలీ రాథోడ్‌.. రావు రమేష్‌.. అలీ.. అజయ్‌ తదితరులు

సంగీతం: శేఖర్‌ చంద్ర

ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు

ఛాయాగ్రహణం: విజయ్‌ మిశ్రా

దర్శకత్వం: రెవోన్‌ యాదు

నిర్మాణం: ఈఎంవీఈ స్టూడియోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

విడుదల తేదీ: 03-02-2018

 

 

చిత్రం: తొలిప్రేమ
నటీనటులు: వరుణ్‌తేజ్‌.. రాశీఖన్నా.. సపనా పబ్బి.. ప్రియదర్శి.. సుహాసిని.. విద్యుల్లేఖ రామన్‌.. హైపర్‌ ఆది తదితరులు
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: జార్జ్‌ సి.విలియమ్స్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాత: బి.వి.ఎన్‌.ఎస్‌. ప్రసాద్‌
డిస్ట్రిబ్యూషన్‌: శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేదీ: 10-02-2018

Page 1 of 2

©2018 ApWebNews.com. All Rights Reserved.