కుదేలైన బ్యాంకింగ్ రంగ షేర్లు

కుదేలైన బ్యాంకింగ్ రంగ షేర్లు

ముంబై: పీఎన్‌బీలో జరిగిన భారీ కుంభకోణంతో బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. దీంతో వారాంతం ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ రంగ సూచీ 2.45 శాతం వరకు పడిపోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు ధర 1,50 శాతం తగ్గి 52 వారాల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ఠానికి తాకిన అలహాబాద్ బ్యాంక్ షేరు ధర చివర్లో కోలుకొని 0.36 శాతం నష్టంతో రూ.54,75 వద్ద స్థిరపడింది. యాక్సిస్ బ్యాంక్ షేరు 1.10 శాతం పతనం చెంది రూ.537.75 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.84 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 3.55 శాతం, పీఎన్‌బీ 2.10 శాతం, ఎస్‌బీఐ 2.55 శాతం, యెస్ బ్యాంక్ 2.52 శాతం చొప్పున మార్కెట్ వాటాను కోల్పోయాయి. మూడో రోజు గీతాంజలి షేర్లు దిగువకే: వరుసగా మూడో రోజు గీతాంజలి షేర్లు దిగువముఖం పట్టాయి. మార్కెట్ ప్రారంభంలోనే 20 శాతానికి పైగా పడిపోయిన షేరు చివరకు కూడా ఇంతే స్థాయిలో పతనం చెంది రూ.37.55 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ మరో రూ.300 కోట్లు కోల్పోయింది. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.