కుదేలైన బ్యాంకింగ్ రంగ షేర్లు

ముంబై: పీఎన్‌బీలో జరిగిన భారీ కుంభకోణంతో బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. దీంతో వారాంతం ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ రంగ సూచీ 2.45 శాతం వరకు పడిపోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు ధర 1,50 శాతం తగ్గి 52 వారాల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ఠానికి తాకిన అలహాబాద్ బ్యాంక్ షేరు ధర చివర్లో కోలుకొని 0.36 శాతం నష్టంతో రూ.54,75 వద్ద స్థిరపడింది. యాక్సిస్ బ్యాంక్ షేరు 1.10 శాతం పతనం చెంది రూ.537.75 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.84 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 3.55 శాతం, పీఎన్‌బీ 2.10 శాతం, ఎస్‌బీఐ 2.55 శాతం, యెస్ బ్యాంక్ 2.52 శాతం చొప్పున మార్కెట్ వాటాను కోల్పోయాయి. మూడో రోజు గీతాంజలి షేర్లు దిగువకే: వరుసగా మూడో రోజు గీతాంజలి షేర్లు దిగువముఖం పట్టాయి. మార్కెట్ ప్రారంభంలోనే 20 శాతానికి పైగా పడిపోయిన షేరు చివరకు కూడా ఇంతే స్థాయిలో పతనం చెంది రూ.37.55 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ మరో రూ.300 కోట్లు కోల్పోయింది. 

  • రూ.3,000 పన్ను చెల్లించాల్సి ఉన్నా తప్పదు
  • ఏప్రిల్‌ 1 నుంచి మినహాయింపుల తొలగింపు
  • డొల్ల కంపెనీలను పసిగట్టేందుకే

దిల్లీ: డొల్ల కంపెనీలను మరింతగా అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా, రూ.3,000 వరకు పన్ను చెల్లించాల్సి వచ్చే కంపెనీలు ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేయకుండా ఉన్న మినహాయింపును తొలగించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 1) నుంచే ఈ మార్పు అమల్లోకి తేవాలన్నది ప్రతిపాదన. రిటర్నులు సమర్పించకపోతే ప్రాసిక్యూషన్‌కు అవకాశం కల్పించే ఐటీ చట్టంలోని నిబంధనకు 2018-19 బడ్జెట్‌ ప్రతిపాదన మరింత పదును పెట్టింది. దీని ప్రకారం, ఏప్రిల్‌ 1న ప్రారంభమయ్యే ఏదేని ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, రిటర్నులు గనుక వేయకపోతే, సంబంధిత కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌/డైరెక్టర్‌/నిర్వహణాధికారిని అందుకు బాధ్యులను చేస్తారు. ఇకపై ఆదాయపు పన్ను విభాగాలు, ఆయా కంపెనీల పెట్టుబడులను పరిశీలిస్తాయి. ఇకపై తక్కువ లాభం చూపుతున్న, తొలిసారిగా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న కంపెనీలపైనా, నిశిత పరిశీలన జరపాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

న్యూఢిల్లీ : బంగారం ధరలు రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. నేటి బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. వచ్చే పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌ను అందుకోవడం కోసం స్థానిక జువెల్లర్ల నుంచి తాజాగా కొనుగోళ్లు పెరుగడంతో, 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.31,170గా నమోదైంది. వెండి ధరలు సైతం రికవరీ అయ్యాయి. రూ.330 మేర పెరిగిన వెండి నేటి మార్కెట్‌లో కేజీకి రూ.39,230గా రికార్డైంది. వెండికి కూడా పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరిగింది. 

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల పెట్టుబడులు విదేశీ మార్కెట్లకు తరలిపోకుండా... ఇకపై అంతర్జాతీయ స్టాక్‌  ఎక్స్చేంజిల్లో తమ సూచీల ట్రేడింగ్‌ను నిలిపివేయాలని మూడు ప్రధాన స్టాక్‌ ఎక్స్చేంజిలు నిర్ణయించుకున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, మెట్రోపాలిటన్‌ స్టాక్‌  ఎక్స్చేంజిఆఫ్‌ ఇండియా (ఎంఎస్‌ఈఐ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సింగపూర్‌ స్టాక్‌  ఎక్స్చేంజి (ఎస్‌జీఎక్స్‌) తాజాగా నిఫ్టీ 50లో భాగమైన కంపెనీల స్టాక్స్‌ ఫ్యూచర్స్‌లో కూడా ట్రేడింగ్‌ ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎస్‌జీఎక్స్‌ తదితర ఎక్స్చేంజిల ధోరణులతో... దేశ మార్కెట్ల నుంచి లిక్విడిటీ విదేశీ మార్కెట్లకు తరలిపోయే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. విదేశీ ఎక్సే్చంజీలు, ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాంల డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌కి సంబంధించి సూచీలు, స్టాక్స్‌ ధరల వివరాలను అందించేందుకు కుదుర్చుకున్న లైసెన్సింగ్‌ ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు మూడు ఎక్సే్చంజీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

బ్యాంకు ఖాతాలకు, రెండు లక్షలు దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్‌ కార్డును తప్పనిసరి చేయడంతో, దాంతో పాటు ఆధార్‌ లింక్‌ చేయడం వంటి వాటితో పన్ను ఎగవేతదారులకు ప్రభుత్వం గండికొడుతోంది. తాజాగా అదనపు రిటర్నులలో రూ.1.7 కోట్ల ఫైల్‌ చేశారని, దీంతో మొత్తంగా ప్రభుత్వం డిసెంబర్‌ వరకు రూ.26,500 కోట్లు ఆర్జించినట్టు తెలిసింది. ఇన్‌-హౌజ్‌ సమాచారంతోనే నాన్‌-ఫైలర్స్‌ను ఆదాయపు పన్ను శాఖ గుర్తిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌కు తెలిపారు. ఈ డేటాను టీడీఎస్‌, టీసీఎస్‌ ద్వారా సేకరించిన ఎక్కువ విలువ ఉన్న లావాదేవీలతో ట్యాలీ చేస్తున్నారని పేర్కొన్నారు.  

నాన్‌-ఫైలర్స్‌ను గుర్తించిన అనంతరం పలు కేటగిరీలోకి కేసులను వర్గీకరించి, మానిటర్‌ చేస్తున్నట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు. రిటర్నులు ఫైల్‌ చేయాలని టార్గెట్‌ చేసిన గ్రూప్‌లుకు టెక్ట్స్‌ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ను పంపుతున్నట్టు కూడా పేర్కొన్నారు. వారి స్పందనలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్ట్‌ ఇన్‌సైట్‌ అనే కొత్త మెకానిజం ద్వారా మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

దిల్లీ: త్వరలో క్రిప్టోకరెన్సీలపై నిబంధనలు ప్రకటించనున్నట్లు సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగి తెలిపారు. నేడు ఆయన మాట్లాడుతూ బిట్‌కాయిన్ల ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటుండటంతో పెట్టుబడిదారులను రక్షించేందుకు త్వరలోనే నిబంధనలను వెల్లడిస్తామన్నారు. ఇప్పటికే పలు నిబంధనలపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. బడ్జెట సమర్పించిన మర్నాడే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ ఆఫైర్స్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇప్పటికే దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో నివేదిక ఇచ్చే విధంగా పూర్తిగా కృషి చేస్తున్నామన్నారు. క్రిప్టో కరెన్సీలపై ఏర్పాటు చేసిన కమిటీలో అజయ్‌  త్యాగి కూడా సభ్యుడే. ఈ కమిటీ క్రిప్టో కరెన్సీల లాభనష్టాలను వివరిస్తుంది. దీంతో పాటు ప్రభుత్వమే క్రిప్టో కరెన్సీ తయారీపై సాధ్యాసాధ్యాలను వివరిస్తుంది. దీనిపై ప్రభుత్వ పాలసీ వెల్లడయ్యాక దానిలో సెబీ పాత్ర ఏమిటో బయటకు వస్తుందని త్యాగి తెలిపారు.

 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.