పార్కింగ్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి ...!

ఎపి వెబ్ న్యూస్.కామ్ 

మహానాడుకు విచ్చేసే వారికి పార్కింగ్‌ సమస్యలు తలెత్తకుండా ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, నగర సీపీ గౌతమ్‌సవాంగ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు.

మొత్తం 60 ఎకరాలను పార్కింగ్‌కు కేటాయించి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే వారికి తెలిపారు. ఉదయం నుంచి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాత్రి సమయంలో పనిచేయడానికి ఫ్లడ్‌లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి నుంచే మైదానంలోను, వెలుపుల సందడి కనపడుతోంది. పెద్ద ఎత్తున బ్యానర్లతో స్థానిక నేతలు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. వీటిని తెదేపా యువ నాయకుడు దేవినేని అవినాష్‌, కడియాల బుచ్చిబాబు, ఎస్‌ఆర్‌పీ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ అన్నే వేణుగోపాలకృష్ణమూర్తి, వైస్‌ ఎంపీపీ కోయ ఆనంద్‌, మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, కానూరు తెదేపా అధ్యక్షుడు దోనేపూడి రవికిరణ్‌, మారుపూడి ధనకోటేశ్వరరావు, వెలగపూడి శంకరబాబు, జాయింట్‌ కమిషనర్‌ కాంతిరాణాటాటా, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రావణ్‌, బొర్రా కృష్ణ, తాతినేని సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.